గువ్వలచెన్న శతకము–Guvvalachenna Shatakam
గువ్వలచెన్న శతకము శతకము గురించి క. శ్రీ పార్థసారధీ! నేఁ బాపాత్ముఁడ నీదు పాలఁ బడినాఁడ ననుం గాపాడు మనుచు నాంతర కోపాదు లడంచి వేడు గువ్వలచెన్నా! ।। 1 ।। క. నరజన్మ మెత్తినందున సరసిజనాభు నెదలోన స్మరియించుచుఁ ద చ్చరణములు మఱవకుండిన గురుఫలమగు జన్మమునకు గువ్వలచెన్నా! ।। 2 ।। క. ఎంతటి విద్యల నేర్చిన సంతసముగ వస్తుతతులు సంపాదింపన్ జింతించి చూడ నన్నియు గొంతుకఁ దడుపుకొను కొఱకె గువ్వలచెన్నా! ।। 3 ।। క. సారాసారము లెఱుఁగని బేరజులకు బుద్ధిఁ జెప్పఁ బెద్దల వశమా నీరెంత పోసి పెంచినఁ గూరగునా నేల వేము గువ్వలచెన్నా! ।। 4 ।। క. అడుగునకు మడుఁగు లిడుచును జిడిముడి పాటింత లేంక చెప్పిన పనులున్ వడిఁజేసి నంత మాత్రాన కొడుకగునా లంజకొడుగు గువ్వలచెన్నా! ।। 5 ।। క. ఈవియ్యని పద పద్యము గోవా చదివించు కొనఁగఁ గుంభిని మీఁదన్ […]
Read more