సుమతీ శతకము–బద్దెన – Sumathi Satakam Baddena Bhupaludu
You can download the audio of Sumati Shatakam (telugu) here. సుమతీ శతకము బద్దెన [మార్చు] 001 శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ భావం: మంచి బుధ్ధిగలవాడా! శ్రీరాముని యొక్క దయవలన నిశ్చయముగా అందరు జనులను ఔరా అనునట్లుగా నోటినుండి నీళ్ళూరునట్లుగా రసములు పుట్టగా న్యాయమును భోధించు నీతులను చెప్పెదన్. [మార్చు] 002 అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ భావం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెఱవేర్చని భగవంతుని, యుద్ధసమయమున ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టవలయును. [మార్చు] 003 అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక […]
Read more