కృష్ణ శతకము: Krishna Shatakam
కృష్ణ శతకము Wikisource నుండి ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ కృష్ణ శతకం గురించి: ఆంధ్రదేశం లో కృష్ణ శతకం ఎంతో ప్రాచుర్యం పొందింది. దీనిని నరసింహ కవి రచించాడు. < p>శతకం: శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీత లోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్ధన కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా||1|| నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడునీడ నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా||2|| నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవ వైరీ క్షీదాబ్ధిశయన యదుకుల వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా||3|| హరి యను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజనాభా హరి నీ నామ మహాత్మ్యము హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా||4|| క్రూరాత్ముడజామీళుఁడు నారాయణ యనుచు నాత్మనందను బిలువన్ ఏ రీతి నేలుకొంటివి యేరీ నీసాటి వేల్పు లెందును […]
Read more