కుమారీ శతకము–Kumari Shatakam
కుమారీ శతకము Wikisource నుండి ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ కుమారీ శతకము శ్రీ పక్కి వేంకట నరశింహ కవీంద్ర కుమారీ శతకం 51వ పద్యం నుండి 1. శ్రీ భూ నీళా హైమవ తీ భారతు లతుల శుభవ తిగ నెన్ను చు స త్సౌభాగ్యము నీ కొసగంగ లో భావించెదరు ధర్మ లోల కుమారీ! < p>ధర్మపరురాలైన ఓ కుమారీ! శ్రీదేవియు, భూదేవియు,నీళాదేవియు,పార్వతీదేవియు,సరస్వతీదేవియు, నిన్ను మిక్కిలి సుగుణవంతురాలిగా ఎన్నుకొని మంచి ముత్తైదవతనమును, మనస్సులందు తమ తమ ఆశీర్వచనములను నీకు ఇచ్చెదరు గాక. 2. చెప్పెడి బుద్ధులలోపల దప్పకు మొక టైన సర్వ ధర్మములందున్ మెప్పొంది యిహపరంబులన్ దప్పింతయు లేక మెలగ దగును కుమారీ! ఓ కుమారీ! నేను చెప్పునట్టి మంచి గుణములనొక్కటినైనను వదలక ఆచరింపుము. ధర్మయుక్తముగా మెప్పు పొంది ఇహపర దోషమిసుమంతైననూ లేకుండా మసలుకొనుము. నీకు శుభములు కలుగును. 3. ఆటల బాటలలోనే మాటయు రాకుండన్ […]
Read more