కుమారీ శతకము–Kumari Shatakam

కుమారీ శతకము Wikisource నుండి ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ కుమారీ శతకము శ్రీ పక్కి వేంకట నరశింహ కవీంద్ర కుమారీ శతకం 51వ పద్యం నుండి 1. శ్రీ భూ నీళా హైమవ తీ భారతు లతుల శుభవ తిగ నెన్ను చు స త్సౌభాగ్యము నీ కొసగంగ లో భావించెదరు ధర్మ లోల కుమారీ! < p>ధర్మపరురాలైన ఓ కుమారీ! శ్రీదేవియు, భూదేవియు,నీళాదేవియు,పార్వతీదేవియు,సరస్వతీదేవియు, నిన్ను మిక్కిలి సుగుణవంతురాలిగా ఎన్నుకొని మంచి ముత్తైదవతనమును, మనస్సులందు తమ తమ ఆశీర్వచనములను నీకు ఇచ్చెదరు గాక. 2. చెప్పెడి బుద్ధులలోపల దప్పకు మొక టైన సర్వ ధర్మములందున్ మెప్పొంది యిహపరంబులన్ దప్పింతయు లేక మెలగ దగును కుమారీ! ఓ కుమారీ! నేను చెప్పునట్టి మంచి గుణములనొక్కటినైనను వదలక ఆచరింపుము. ధర్మయుక్తముగా మెప్పు పొంది ఇహపర దోషమిసుమంతైననూ లేకుండా మసలుకొనుము. నీకు శుభములు కలుగును. 3. ఆటల బాటలలోనే మాటయు రాకుండన్ […]

Read more

కుమార శతకము–Kumara Shatakam

కుమార శతకము శ్రీ పక్కి వేంకట నరశింహ కవీంద్ర కుమార శతకం 51వ పద్యం నుండి 1. శ్రీ భామినీ మనొహరు సౌభాగ్య తయా స్వభావు సారసనాభున్ లోఁ భావించెద; నీకున్ వైభవము లొసగుచుండ, వసుధఁ గుమారా < p>ఓ కుమారా!సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి మనసును ఆకర్షించినవాడును, ఐశ్వర్య భోగభాగ్యములను దయతో ఇచ్చు స్వభావము కలవాడును, నాభియందు పద్మము కలవాడును, అయిన విష్ణుమూర్తి, సంపదలనిచ్చే శ్రీ హరిని ప్రార్ధించుచున్నాను. 2. పెద్దలు వద్దని చెప్పిన పద్దుల బోవంగరాదు పరకాంతల నే పొద్దే నెద బరికించుట కుపదేశింపగఁ గూడ దుర్విఁ గుమారా! ఓ కుమారా! పెద్దలు వద్దని చెప్పిన పనులను పంతములకు పోయి చేయరాదు. ఇతర స్త్రీలను ఎన్నడునూ మనసులో తలంచుట మంచిది కాదు. ఈ విషయములను మనసులో నుంచుకొని భూమిపై మెలగుము. 3. అతి బాల్యములో నైనను బ్రతికూలపు మార్గములఁ బ్రవర్తింపక స ద్గతి మీర మెలగ నేర్పిన నతనికి […]

Read more

గువ్వలచెన్న శతకము–Guvvalachenna Shatakam

గువ్వలచెన్న శతకము శతకము గురించి క. శ్రీ పార్థసారధీ! నేఁ బాపాత్ముఁడ నీదు పాలఁ బడినాఁడ ననుం గాపాడు మనుచు నాంతర కోపాదు లడంచి వేడు గువ్వలచెన్నా! ।। 1 ।। క. నరజన్మ మెత్తినందున సరసిజనాభు నెదలోన స్మరియించుచుఁ ద చ్చరణములు మఱవకుండిన గురుఫలమగు జన్మమునకు గువ్వలచెన్నా! ।। 2 ।। క. ఎంతటి విద్యల నేర్చిన సంతసముగ వస్తుతతులు సంపాదింపన్ జింతించి చూడ నన్నియు గొంతుకఁ దడుపుకొను కొఱకె గువ్వలచెన్నా! ।। 3 ।। క. సారాసారము లెఱుఁగని బేరజులకు బుద్ధిఁ జెప్పఁ బెద్దల వశమా నీరెంత పోసి పెంచినఁ గూరగునా నేల వేము గువ్వలచెన్నా! ।। 4 ।। క. అడుగునకు మడుఁగు లిడుచును జిడిముడి పాటింత లేంక చెప్పిన పనులున్ వడిఁజేసి నంత మాత్రాన కొడుకగునా లంజకొడుగు గువ్వలచెన్నా! ।। 5 ।। క. ఈవియ్యని పద పద్యము గోవా చదివించు కొనఁగఁ గుంభిని మీఁదన్ […]

Read more